పర్షియా భామల అందం వెనుక ఉన్న రహస్యం ఏమిటంటే..వారు స్నానం చేసే పది నిమిషాల ముందు నీళ్ళలో కొన్ని పాలు కలిపి, కొద్దిసేపు ఆగిన తర్వాత తిరిగి స్నానం చేస్తారు. ఇలా ప్రతి రోజూ చేయడం వల్ల మేని ఛాయ మెరుగుపడుతుంది. ఇక అంతే కాదు బాత్ టబ్ లో స్నానం చేసేటప్పుడు అప్పుడప్పుడు గోరువెచ్చని నీటిని నింపి, ఆలివ్ ఆయిల్,బాదం ఆయిల్ లేదా కొబ్బరి నూనె ఇలా, వీటిలో ఏదో ఒకటి కొన్ని చుక్కలు బాత్ టబ్ లో వేసుకొని బాగా కలుపుకొని స్నానం చేయాలి .. ఇలా స్నానం చేయడం వల్ల చర్మం సహజతేమను కోల్పోకుండా ఉంటుంది.