పాల నురుగు లాంటి మేనిఛాయ మన సొంతం చేసుకోవడానికి, ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన పదార్థం కుంకుమపువ్వు.. ఈ కుంకుమ పువ్వు ను ఎలా ఉపయోగించాలి అంటే.. ఒక అర కప్పు పెరుగు, అర టేబుల్ స్పూన్ కుంకుమపువ్వు, ఒక టేబుల్ స్పూన్ తేనె అన్నీ కలిపి మిశ్రమంలా తయారు చేయాలి..ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చర్మానికి పై పూతగా పూసి, 30 నిమిషాల పాటు ఆరనివ్వాలి.ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.. పెరుగు, తేనె చర్మానికి తగినంత తేమను అంధించడంతో పాటు, చర్మం తేమను కోల్పోకుండా చేస్తాయి. అంతేకాక ముఖం మీద ఏర్పడిన మచ్చలు, మొటిమలు కూడా తొలగిపోతాయి. ఇక కుంకుమపువ్వు మేని ఛాయను మెరుగుపరచి మిల్క్ బ్యూటీ లా కనిపించేలా చేస్తుంది..