ముఖం అలాగే మెడ మీద జిడ్డు కారుతూ నల్లగా వుంటే ఒక ఆపిల్ తీసుకొని, దానిని పీలర్ సహాయంతో తొక్కను తొలగించాలి. ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి,ఆ ఆపిల్ ముక్కలను మిక్సీలో వేసి, మెత్తటి పేస్టులాగా చేసుకోవాలి. ఇక ఆ తరువాత దీనికి ఒక టేబుల్ స్పూన్ శెనగపిండి, ఒక టేబుల్ స్పూన్ ఓట్స్ పౌడర్, అర టేబుల్ స్పూన్ తేనె కలిపి బాగా మిశ్రమములా తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ భాగంలో ఎక్కడ నల్లగా ఉందో అక్కడ అప్లై చేయండి. ఒక ఇరవై నిమిషాల పాటు అలాగే ఉంచి, తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల త్వరలోనే జిడ్డు సమస్య ను తొలగించుకోవచ్చు.