ప్రసవానంతరం వచ్చే అందం సమస్యలను తొలగించాలంటే మొటిమల సమస్యను దూరం చేసుకోవాలంటే, రోజుకు రెండుసార్లు గాఢత తక్కువగా ఉండే ఫేస్ వాష్ తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత కలబంద, యూకలిప్టస్ ఆయిల్ వంటి పదార్థాలను ఫేస్ ప్యాక్ ల రూపంలో చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇక అంతే కాకుండా బయటకు వెళ్లేటప్పుడు మాయిశ్చరైజర్ రాసుకోవడం తప్పనిసరి.క్రీమ్స్ లేదా ఆయిల్ తో పాటు చక్కటి పోషకాహారం, బ్రిస్క్ వాక్, యోగా వంటి తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల, ఈ స్ట్రెచ్ మార్క్స్ ను తొలగించడం కొంతవరకు సులభం అవుతుంది..ప్రసవానంతరం జుట్టు రాలే సమస్యను అదుపు చేయాలంటే, మనం తీసుకొనే ఆహారంతోనే అది సాధ్యమవుతుంది. ఈ క్రమంలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే బెర్రీస్, పాలకూర, డార్క్ చాక్లెట్ వంటివి తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇవన్నీ కూడా జుట్టు కుదుళ్లను దృఢంగా మార్చుతాయి.