వేసవి కాలంలో ఉక్కపోత నుండి బయట పడాలంటే నిమ్మరసం, రోజ్ వాటర్ తో తాజాదనాన్ని ఇట్టే పొందవచ్చు.. అయితే ఇందుకోసం నిమ్మరసం అర కప్పు, రోజ్ వాటర్ ఐదు చెంచాలు తీసుకొని, స్నానం చేసే నీళ్ళలో వేసి బాగా కలపాలి. ఒక 10 నిమిషాలు ఆ నీటిని అలాగే వదిలేసి, ఆ తర్వాత ఈ నీటితో స్నానం చేయడం వల్ల చర్మం శుభ్రం అవ్వడమే కాకుండా, తిరిగి ప్రకాశవంతంగా ఉంటుంది. నిమ్మరసం చెమటకు చెక్ పెట్టి, జిడ్డు తనాన్ని నివారిస్తే, రోజ్ వాటర్ మనల్ని అధిక సమయం తాజాగా ఉండేలాగా చేస్తుంది..