మెనిక్యూర్ అనేది చేతివేళ్లను అందంగా తీర్చిదిద్దడానికి ఉపయోగించే ఒక సౌందర్య పద్ధతి. ఇక ఇందులో మెనిక్యూర్ చేసేటప్పుడు మెనిక్యూర్ చేసేటప్పుడు చేతి గోళ్లకు ఉన్న పాత నెయిల్ పెయింట్ ను తుడిచివేస్తారు. తరువాత గోళ్ళను నచ్చిన ఆకృతిలో అందంగా కత్తిరించి, ట్రిమ్ చేస్తారు. ఇలా రెండు చేతుల గోళ్లను ట్రిమ్ చేశాక, ఒక గిన్నెలో సోప్ వాటర్ ను తీసుకొని, దానిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ , గ్లిజరిన్ , నిమ్మరసం వేసి రెండు చేతుల వేళ్లు మునిగేలా అందులో ముంచి పదినిమిషాలు ఉంచుతారు. ఇలా చేయడంవల్ల గోళ్లలో ఉండే మలినాలు, సూక్ష్మజీవులు నశించి, గరుకుగా ఉండే క్యూటికల్స్ మెత్తగా తయారవుతాయి. ఇక ఆ తరువాత గోరు చుట్టూ ఉండే చర్మం కూడా మెత్తబడుతుంది. ఇక అరచేతుల నుంచి మోచేతుల వరకు శుభ్రంగా క్లీన్ చేస్తారు