అవును మీరు చదివింది కరెక్టే. కాకపోతే రెండు రాష్ట్రాల్లో ఏ విషయంలో టిడిపి పోటి పడుతోందో చెప్పుకోవాల్సిందే. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణాలో టిడిపి దాదాపు కనుమరుగైపోయిన విషయం తెలిసిందే. చంద్రబాబునాయుడు రెండు కళ్ళ సిద్ధాంతం దారుణంగా బెడిసికొట్టింది. అంటే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి ఒక కన్ను లాంటి తెలంగాణా దాదాపు మూసుకుపోయినట్లే. ఇక రెండో కన్ను అయిన ఏపిలో కూడా పార్టీ దాదాపు మూతపడిపోతోందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎలాగంటే క్షేత్రస్ధాయిలో పార్టీ కార్యక్రమాలు జరిగి సుమారు ఐదు మాసాలైపోయింది. పార్టీ అధినేతే కరోనా వైరస్ పేరుతో ఏపిని వదిలెసి హైదరాబాద్ లో కూర్చున్నపుడు ఇక నేతలు మాత్రం ఎందుకు రోడ్లపైకి వస్తారు ? పైగా తనకు కన్వీనియెంటుగా ఉంటుందని చంద్రబాబు జూమ్ అప్లికేషన్ ను వాడుతున్నాడు. అదే పద్దతిలో పార్టీ నేతలు కూడా జూమ్ యాప్ ద్వారానే కార్యకర్తలతో మాట్లాడుతున్నారు. చివరకు చంద్రబాబు పిలుపు ప్రకారం నిరసనలను కూడా నేతలు జూమ్ యాప్ లోనే కానిచ్చేస్తున్నారు.