ఇక మనిషి అందం గురించి వివరించడం అంటూ జరిగితే అది ముఖం దగ్గర నుండి మొదలవుతుంది.అందులో ఇక ప్రముఖమైనవి ఎదుటివారిని ఎంతగానో ఆకర్షించేవి రెండే రెండు. అందులో ఒకటి కళ్ళు అయితే, రెండవది పెదవులు.మరి ముఖంలో ఇంత ప్రాముఖ్యత ఉన్న వీటికి ఏమైనా జరిగితే వామ్మో ఇంకేమైనా ఉందా.ఊహించడానికే చాలా భయం వేస్తుంది కదా. కానీ మనం ఎంత జాగ్రత్తగా వున్నా కానీ వాతావరణ మార్పుల వలన కొన్ని సార్లు ఈ సమస్యలు అనేవి తప్పవు.ఇక ఈ చలి కాలంలో పెదవులు ఎండిపోవడం ఇంకా పగలడం లాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇక వీటిని అధికమించడానికి ఎక్కువ శ్రమ పడవలసిన పని లేదు. అసలు ఈ సమస్య రావడానికి కారణం ఏమిటో తెలిస్తే పరిష్కారం చాలా సులభం అవుతుంది.ఇక వాతావరణం అనేది చల్లగా ఉండటం వలన మనం అధికంగా నీరు తాగడం మానేస్తాం.


అయితే అది మంచి పద్దతి కాదు, ఏ కాలంలో అయినా సరే మనిషి సగటున ఐదు లీటర్ల నీళ్లు తాగాలి అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. దీని వలన చర్మం తో పాటుగా జుట్టు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకా అలానే వాతావరణంలో పొడి గాలులు కూడా వీస్తూ ఉంటాయి. ఇక వీటి వలన కూడా తేమ తక్కువ అయ్యి పగుళ్ల సమస్య రావడం అనేది జరుగుతుంది. ఇక ఇలాంటి సమయంలో మీరు వెన్న వాడటం చాలా రకాలుగా మంచిది. మీరు రాత్రి వేళలో మీ పెదాలకు వెన్న రాసి ఉదయం స్నానం చేసే వరకు కూడా ఉంచుకోండి. ఇక ఇలా మీరు వారానికి మూడు రోజులు చెయ్యడం వలన మీ పెదాలు చాల మృదువుగా ఇంకా అలాగే అందంగా కనపడతాయి. ఇంకా అలానే మీరు ఈ పగుళ్ల సమస్య నుండి కూడా ఈజీగా బయటపడతారు.


మరింత సమాచారం తెలుసుకోండి: