పారిశ్రామిక దిగ్గజం అయిన ముఖేష్ అంబానీ కంపెనీ అయినా జియో ప్లాట్ ఫార్మ్ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ పెట్టుబడులను ఆకర్షించింది. జియో ప్లాట్ ఫార్మ్ లో గూగుల్ ఏకంగా 4 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఈ ఒప్పందానికి సంబంధించి కొద్ది వారాల్లో మరికొన్ని వివరాలు వెల్లడి కానున్నట్లు మార్కెట్ వర్గాల్లో ఊహాగానాలు వెలువడుతున్నాయి.