రాష్ట్ర మంత్రులుగా చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, డాక్టర్ సీదిరి అప్పలరాజు ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లోని దర్బార్ హాలులో ఈ ఇద్దరితో బుధవారం మధ్యాహ్నం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణం చేయించారు. వేణుగోపాలకృష్ణకు రహదారులు భవనాల శాఖ, అప్పలరాజుకు మత్స్య, పశుసంవర్ధక శాఖలను అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం.