ప్రభుత్వ ఆస్తులు అమ్మకాల(మిషన్ బిల్డ్ ఏపీ)పై సోషల్ యాక్టివిస్ట్, జర్నలిస్ట్ తోట సురేష్ బాబు దాఖలు చేసిన పిటిషన్ను నేడు హైకోర్టు విచారించగా, ఏపీ ప్రభుత్వంపై న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. రాజ్యం వేరు, ప్రభుత్వం వేరని హైకోర్టు స్పష్టం చేసింది. రాజ్యం శాశ్వతమని, ప్రభుత్వం శాశ్వతం కాదని పేర్కొంది.