ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యావరణాన్ని కాపాడేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'జగనన్న పచ్చతోరణం' కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలో లాంఛనంగా ప్రారంభించారు.