భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో వరదల వల్ల ప్రాణాలు కోల్పోయినవారికి రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్ర సంతాపం తెలిపారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోదీకి పంపిన సందేశంలో పుతిన్ తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారని రష్యా అధ్యక్ష కార్యాలయం ప్రకటించింది.