హైదరాబాద్ నగరంలోని మరో భారీ ప్రాజెక్టుకు జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. ఎస్ఆర్డీపీ కింద రూ.523 కోట్లతో నల్గొండ క్రాస్ రోడ్ నుండి ఓవైసీ జంక్షన్ వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ నేడు శంకుస్థాపన చేశారు.