ప్రముఖ పాకిస్తానీ జర్నలిస్ట్ మతీఉల్లా జాన్ అపహరణకు గురయ్యారు. ఆయుధాలతో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు ఆయన్ను తీసుకెళ్లి కొన్ని గంటల తరువాత వదిలేశారు. పాకిస్తాన్లోని మిలటరీ ఆధిపత్యాన్ని మతీఉల్లా జాన్ బహిరంగంగా విమర్శించేవారు. జాన్ అపహరణకు గురైన వీడియోపై సోషల్ మీడియాలో కలకలం రేగింది.