దేశవ్యాప్తంగా 9 లక్షల మందికి పైగా బ్యాంకు ఎంప్లాయీస్ కు శుభవార్త అందింది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్( ఐబీఏ), ఉద్యోగ సంఘాల మధ్య జరిగిన చర్చల్లో 15 శాతం జీతాల పెంపుతో పాటు, నాలుగు శాతం పెన్షన్ కంట్రిబ్యూషన్ ను పెంచేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ పెంపు నవంబర్ 2017 నుంచే అమలులోకి రానుంది.