కొత్తగా సైన్యానికి అందనున్న ఐదు రఫేల్ యుద్ధవిమానాల పోరాట సామర్థ్యాన్ని మరింత పెంచాలని భారత వైమానిక దళం నిర్ణయించింది. గాల్లో నుంచి భూతలంలోని లక్ష్యాలను ఛేదించగల కొత్త తరం క్షిపణి వ్యవస్థను దీనికి అమర్చాలని నిర్ణయించింది.