బంగ్లాదేశ్‌కు భారత్ 10 రైలు ఇంజన్లు అందజేసింది. నేడు కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో కలిసి కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయల్ వీటికి పచ్చజెండా ఊపారు. భారతీయ రైల్వే తయారు చేసిన అత్యాధునిక పది డీజిల్ రైలు ఇంజన్లను ఇరు దేశాల అధికారుల సమక్షంలో బంగ్లాదేశ్ రైల్వేకు అప్పగించారు. బంగ్లాదేశ్‌లోని 90 బ్రాడ్ గేజ్ రైలు ఇంజన్లలో 72 శాతం జీవితకాలం ముగిశాయి. ఈ నేపథ్యంలో భారత్ నుంచి వీటిని సమకూర్చేందుకు ఆ దేశం ప్రతిపాదన పంపిన నేపథ్యంలో పొరుగు దేశాలకు ప్రాధాన్యత కార్యక్రమంలో భాగంగా భారత్ పది రైలు ఇంజన్లను బంగ్లాదేశ్‌కు నేడు అందజేసింది.