చౌకధరతో ఆస్పత్రి ఖర్చులకోసం రోజువారీ నగదు ప్రయోజనాలను అందించే పథకం కోసం భారతదేశంలో ప్రైవేటు రంగ నాన్ -లైఫ్ బీమా రంగంలో అగ్రగామి సంస్థగా ఉన్న ఐసీఐసీఐ లోమ్బార్డ్ తో ఫోన్ పే చేతులు కలిపింది. సాచెట్ ఆధారిత బృంద బీమా ఉత్పత్తి అయిన గ్రూప్ సేఫ్ గార్డు ఇన్స్యూరెన్స్ కింద ఆస్పత్రి రోజువారీ నగదు ప్రయోజనాల బీమా పథకాన్ని ఆవిష్కరించినట్టు ఆ రెండు సంస్థలు నేడు ప్రకటించాయి. ఇది వినియోగదారులకు తగినట్టు అనుకూలింపజేసుకునే ఆస్పత్రి పాలసీ. దీని ద్వారా ఫోన్ పే వినియోగదారులు గాయాలతో లేదా కొవిడ్-19 లాంటి అస్వస్థతల కారణంగా ఆస్పత్రి పాలైతే, బీమా సొమ్మును అందుకునేందుకు వీలవుతుంది.