ఊసరవెళ్లి రంగులు మార్చడం విన్నాం. కానీ, ఫొటోలో బంధించడం ఇప్పటికీ కష్టసాధ్యమైన పనే. అయితే ఊసరవెళ్లి గుడ్లు పెడుతుండగా తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై పట్టణం తంబారానికి చెందిన శ్రీనివాసన్ రేమ్స్ నేవీ రిటైర్డ్ కమాండర్ తన తోటలో విహరిస్తుండగా ఊసరవెళ్లి గుడ్లు పెడుతున్న అరుదైన దృశ్యాన్ని ఒడిసిపట్టాడు. ఆకుపచ్చ, గోధుమ రంగులో ఉన్న ఊసరవెళ్లి ఓ చిన్న రంధ్రంలో గుడ్లు పెడుతుండగా అతడు తీసిన చిత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.