కరోనా పాజిటివ్ వచ్చిన 256 మందికి రూ. 20 వేల చొప్పున రూ. 51.20 లక్షలు, హోమ్క్వారంటైన్లో ఉన్న మరో 81 మందికి రూ. పది వేల చొప్పున రూ. 8.10 లక్షలను అందించామని మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకూ కరోనా బారిన పడిన 337 మంది పాత్రికేయులకు 59.30 లక్షల రూపాయల మేర ప్రభుత్వం ఆర్దిక సహాయం అందించింది.