తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో పది రూపాయల డాక్టర్‌గా పేరొందిన ప్రముఖ వైద్యుడు సీ మోహన్‌రెడ్డి (84) ఇక లేరు. శ్వాసకోస సమస్యలతో బాధపడుతూ ఆయన ఆదివారం మృతి చెందారు. ఇటీవల కరోనా బారినపడ్డ ఆయన కోలుకున్నారు. దాతృత్వానికి ప్రసిద్ధి చెందిన మోహన్‌రెడ్డి వయస్సు సహకరించనప్పటికీ కొవిడ్-19కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో పాల్గొని చాలా మంది పేషెంట్లకు సేవలందించారు.