సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం ద్వారానే కరోనా పోరాటంలో భారత్ మెరుగైన స్థితిలో ఉందని ప్రధాని మోదీ తెలిపారు. దేశవ్యాప్తగా 1300 పరీక్షా కేంద్రాల్లో రోజుకు 5 లక్షల పరీక్షలను నిర్వహిస్తున్నామని తెలిపారు. రోజుకు 10 లక్షల కరోనా పరీక్షలు నిర్వహించేలా పరీక్షా కేంద్రాల సంఖ్యను పెంచుతున్నామని, ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో అధునాతన సదుపాయాలు కలిగిన ల్యాబొరేటరీలను ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. నోయిడా, ముంబై, కోల్కతాలో వీటిని ఏర్పాటు చేశారు.