2021 జులై వరకూ గూగుల్ ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు గూగుల్ నిర్ణయించిందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ నిర్ణయం ద్వారా.. గూగుల్లో పనిచేస్తున్న రెండు లక్షలకు పైగా ఉద్యోగులకు, కాంట్రాక్ట్ సిబ్బంది లాభపడనున్నారని సమాచారం. ఈ విషయమై కంపెనీలో గత వారం విస్తృత చర్చ జరిగిన అనంతరం సీఈఓ సుందర్ పిచాయ్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.