కరోనా బాధితులను గుర్తించడంలోనూ జాగిలాలకు ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టాలంటే ముందుగా వైరస్ సోకినవారిని గుర్తించి, దానికోసం టెస్టులు చేయాలి. అదొక్కటే మార్గం. ఈ నేపథ్యంలో నిపుణులు జాగిలాలకు ట్రైనింగ్ ఇచ్చి రోగులను గుర్తించే ఆలోచన చేస్తున్నారు. స్నిప్పర్ డాగ్స్ కు శిక్షణ ఇవ్వడం ద్వారా వైరస్ వ్యాప్తిని అదుపులోకి తీసుకురావచ్చని సూచిస్తున్నారు. అయితే లక్షణాలు లేని వారిని ఇవి గుర్తుపట్టలేవు. కాకపోతే, వ్యాధి లక్షణాలు ఉన్నవారిని మాత్రం పట్టేస్తాయి. ఇక ఇప్పటికే సింటమ్స్ ఉన్నవారిని గుర్తించేందుకు లండన్, అమెరికా వంటి దేశాల్లో స్నిఫ్పర్ డాగ్స్‌కు ట్రైనింగ్ ఇస్తున్నారు.