దేశంలో 59 యాప్లను నిషేధించిన దాదాపు నెల తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ 47 చైనీస్ యాప్లను బ్యాన్ చేస్తున్నట్లు సోమవారం ఉదయం ప్రకటించిన విషయం తెలిసిందే. వీటిలో టిక్ టాక్ లైట్, హెలో లైట్, షేర్ఇట్ లైట్, బిగో లైట్, వీఎఫ్వై లైట్ ఉన్నాయి. వీటిని గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ల నుంచి తొలగించారు. ఇంకా కొన్ని తొలగించనున్న యాప్ల జాబితాను కూడా త్వరలో విడుదల చేయనున్నారు. ఇందులో పబ్జీ గేమ్ కూడా ఉండనుందని సమాచారం.