వరుసగా ప్రజాప్రతినిధులు కరోనా బారినపడుతూనే ఉన్నారు. ఇప్పటికే తమిళనాడులో పలువురు అధికార అన్నాడీఎంకే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో పాటు.. అధికారులు, ప్రజాప్రతినిధులకు కరోనా సోకగా.. తాజాగా, నాగర్‌కోయిల్ డీఎంకే ఎమ్మెల్యే ఎన్ సురేష్ రాజన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయనను నాగర్‌కోయిల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి తరలించి చికిత్స అందిస్తున్నారు.