కర్నూలులో విద్యుత్ శ్మశాన వాటికలు ఏర్పాటు కానున్నాయి. జమ్మిచెట్టు ప్రాంతం, సుంకేసుల రోడ్డులో ఉన్న హిందూ శ్మశాన వాటికల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. జమ్మిచెట్టు ప్రాంతంలో పనులు పూర్తికాగా.. నేడో, రేపో జిల్లా కలెక్టర్ వీరపాండియన్తో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వీటిని కోవిడ్, సాధారణ మృతదేహాల అంతిమ సంస్కారాలకు వినియోగించనున్నారు.