కొలంబియాలోని సిన్స్ లేజోలో 67 ఏళ్ళు వయసు కలిగిన ఓ పెద్దాయన హైబిపితో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళాడు. అయితే, రెండు గంటల తరువాత అయన మరణించాడని చెప్పడంతో తండ్రితో పాటు వచ్చిన కూతురు షాక్ అయ్యింది. కరోనా వైరస్ కారణంగా డెడ్ బాడీని అప్పగించబోమని ఆ డెడ్ బాడీని మార్చురీకి పంపించాలని వైద్యులు చెప్పారు. అయితే తండ్రితో కదలికలు కనిపించిన అతని కూతురికి తండ్రి చనిపోలేదని గట్టి నమ్మకంతో గట్టిగా తట్టి లేపింది. దీంతో ఆ తండ్రి కళ్ళు తెరవడంతో, వెంటనే తండ్రిని తీసుకొని వేరే ఆసుపత్రికి వెళ్లారు. బతికుండగానే చనిపోయాడని చెప్పిన సదరు ప్రైవేట్ ఆసుపత్రిపై చర్యలు తీసుకుంటామని అతని కూతురు చెప్పింది.