దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో కరోనా పరీక్షలు చేయించుకున్న వ్యక్తులు ఆచూకీ తెలియడంలేదు. ఇటువంటి ఘటన మళ్లీ జరగకుండా ఉండేందుకు బృహత్ బెంగళూరు మహానగర పాలిక ఓ నిర్ణయం తీసుకుంది. ఇకపై కరోనా టెస్టులు చేయించుకున్న ప్రజలకు ఐడీకార్డులు, అడ్రస్ ప్రూఫ్లతోపాటు మొబైల్కు వచ్చే ఓటీపీ కూడా ఇవ్వాలని అధికారులు ఆదేశించారు. ఈ విషయాన్ని బీబీఎంపీ చీఫ్ ఎన్ మంచునాథ ప్రసాద్ వెల్లడించారు.