రాజస్థాన్ ధోల్పూరులోని గుర్జా గ్రామానికి చెందిన రాజీవ్ కుష్వాహా.. రెండున్నర నెలల వయసున్న ఓ మేకను కొనుగోలు చేయగా, ఆరు నెలల తర్వాత ఆ మేక పొదుగును అభివృద్ధి చేసింది. ఆ సమయంలో పొదుగును పితకగా.. పాలు ఉత్పత్తి అయ్యాయని, ప్రతి రోజు 200 నుంచి 250 గ్రాముల పాలను ఇస్తున్నట్లు యజమాని తెలిపాడు. ఓ మగ మేక పాలివ్వడం ఇదే మొదటిసారి అని స్థానికులు తెలిపారు. హర్మోన్ల అసమతుల్యత కారణంగా మేక పాలు ఇస్తుందని పశు సంవర్ధక శాఖ వైద్యులు చెబుతున్నారు.