గాంధీజీ, మార్టిన్ లూథర్ కింగ్ అనుసరించిన అహింసా సిద్ధాంతాలకు తగిన ప్రచారం కల్పించే విధంగా అమెరికా కాంగ్రెస్ కమిటీ కీలక బిల్లును ఆమోదించింది. అహింసా విధానాల ద్వారా సమస్యలు పరిష్కరించే విధంగా బిల్లు రూపొందించారు. మార్టిన్ సమకాలీనుడైన పౌర హక్కుల కార్యకర్త ఈ బిల్లును తయారు చేయగా... భారత సంతతికి చెందిన అమి బెరా అమెరికా పార్లమెంట్లో ప్రతిపాదించారు..!