లాక్డౌన్ పరిణామాలు పేదలను, రోజూ కూలీలను మరింత కుదిపేస్తున్నాయి. రెక్కాడితేగాని డొక్కాడని వారి జీవితాలకు పిల్లల చదువు మరో సవాలుగా మారింది. దీంతో, కర్ణాటకకు చెందిన ఓ మహిళ పిల్లల చదువు ఆగకూడదని మంగళసూత్రం తాకట్టు పెట్టి, స్మార్ట్ టీవీ కొనుగోలు చేసింది.