తొలి దశ క్లినికల్ ట్రయల్స్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఆక్స్ఫర్డ్ టీకా.. రెండు, మూడో దశ మానవ ప్రయోగాలకు సిద్ధమవుతోంది సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ). ఈ నేపథ్యంలో క్లినికల్ ట్రయల్స్‌కు సీరంకు అనుమతించాలని కొవిడ్-19పై ఏర్పాటైన సీడీఎస్సీఓకు చెందిన నిపుణుల కమిటీ భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ)కి సిఫారసు చేసింది.