హైదరాబాద్ పంజాగుట్టలో దంపతులు వెంకటేశ్వరనాయుడు, లక్ష్మి బలవన్మరణానికి పాల్పడ్డారు. శీతలపానీయంలో పురుగులమందు కలుపుకుని తాగారు. ఆ వృద్ధ దంపతులు గత 10 రోజులుగా దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. కరోనా సోకిందన్న అనుమానంతో ఆందోళనకు గురయ్యారు. తమ నుంచి మనవళ్లకు కరోనా సోకుతుందనే భయంతో ఆత్మహత్య చేసుకున్నారు.