కర్ణాటక హుబ్బళీలోని ఖలాఘటగికి చెందిన ఓ రైతు పిల్లలను సరదాగా తిప్పడం కోసం ఓ చిన్నపాటి బండిని రూపొందించాడు. అచ్చం ఎడ్లబండిలా కనిపించేలా రెండు గొర్రెలను ఓ బండికి కట్టి మనవళ్లను ఎక్కించి తీసుకెళ్తున్నాడా రైతు. అటుగా వెళ్తున్నవారు ఈ బుల్లిబండిని చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఇది వైరల్గా మారింది.