ఆపిల్ సంస్థ ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో సంస్థ మెరుగైన పనితీరుతో ఆపిల్ షేర్లకు రెక్కలొచ్చాయి. షేర్లు 10 శాతానికిపైగా వృద్ధి చెందడం వల్ల సౌదీ ఆరామ్కోను అధిగమించింది ఆపిల్.