సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో తీగజాతికి చెందిన మొక్కకు పూసిన పుష్పాలు ఆకట్టుకుంటున్నాయి. తీగజాతికి చెందిన ఈ పుష్పాలు అచ్చం రాఖీని పోలి ఉండడం అందరూ ఆ పుష్పాలను పట్టుకొని మరీ చూస్తున్నారు. నాలుగేళ్ల క్రితం నాటిన ఈ మొక్క ఈ ఏడాది పువ్వులు పూసి.. చాలా బాగున్నాయని స్థానికులు అంటున్నారు.