కరోనా సంక్షోభంతో ఆన్లైన్ విద్యాబోధన దేశవ్యాప్తంగా పెరిగిపోయింది. అయితే కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్ సౌలభ్యం లేని వారికి ఇది కష్టంగా మారింది. తాజాగా.. కర్ణాటక బాగల్‌కోట్‌లోని అక్కాచెల్లెళ్లు మొబైల్ కొనుక్కునేందుకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవడం వల్ల పొలంలో పనిచేశారు. వచ్చిన డబ్బుతో ఫోన్ కొనుగోలు చేసి యూట్యూబ్‌లో పాఠాలు వింటున్నారు.