రామాలయ నిర్మాణానికి నేడు భూమి పూజ నేపథ్యంలో ప్రధాని మోదీ అయోధ్యకు బయలుదేరారు. ప్రత్యేక విమానంలో ఆయన అయోధ్యకు పయనమయ్యారు. పట్టుపంచె, పొడగు కుర్తా ధరించిన మోదీ మెడలో పట్టువస్త్రాన్ని వేసుకున్నారు. సంప్రదాయబద్ధ వస్త్రధారణలో మోదీ లక్నో నుంచి హెలికాప్టరులో బయలుదేరి అయోధ్యలోని సాకేత్ కళాశాల హెలిప్యాడ్ లో దిగనున్నారు. అనంతరం ప్రత్యేక కాన్వాయ్ లో రామాలయం భూమి పూజా స్థలానికి చేరుకుంటారు.