కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావు పాటిల్ కన్నుమూశారు. రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషించి దాదాసాహెబ్గా పేరుగాంచిన శివాజీరావు.. రాష్ట్ర మంత్రి వర్గంలో వివిధ పదవులు చేపట్టారు. 1985లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. 9 నెలలపాటు ఆ పదవిలో కొనసాగారు.