తనకి వీలున్నప్పుడల్లా బొమ్మలు గీస్తూ సమయాన్ని గడిపే నాయుడు బ్రహ్మానందం.. తాజాగా తనలోని అద్భుతమైన కళను మరోసారి బయటపెట్టాడు. నిన్న అయోధ్య రామమందిర నిర్మాణానికి పునాది రాయి పడిన నేపథ్యంలో ఆయన తన మరోసారి తన టాలెంట్‌కు పని చెప్పాడు. ఈ సందర్భంగా బ్రహ్మనందం శ్రీరాముడి స్కెచ్ వేశారు. ఆ స్కెచ్ లో శ్రీరాముడితో పాటు అంజనేయుడు, ఒకరిని ఒకరు ఆత్మియంగా ఆలింగనం చేసుకుంటున్నారు. ఆ చిత్రం చూడాటానకి నిజంగా రెండు కళ్ళు చాలవు. ఆ స్కెచ్‌లో ఆంజనేయుడు తన్మయత్వంతో కన్నీళ్లు కారుస్తూ, రాముడికి గుడి కడుతున్న వేళ ఆనందపడుతున్నాడేమో అన్నట్లుగా కనిపిస్తూ అద్భుతంగా ఉంది.