అయోధ్య భూమి పూజ కార్యక్రమాన్ని టీటీడీ ఛానల్లో ప్రసారం చేయకపోవడంపై బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని చానల్లలో అయోధ్య భూమి పూజ కార్యక్రమం ప్రసారం చేశారని టీటీడీ ఛానల్ లో ఎందుకు ప్రసారం చేయలేదు అంటూ ప్రశ్నించారు.సీఎం జగన్ దీనిని సీరియస్ గా తీసుకునే చర్యలు చేపట్టాలంటూ డిమాండ్ చేశారు.