ఖలాసి నియామకాలను నిలుపుదల చేస్తూ రైల్వే బోర్డు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉద్యోగాలకు ముగింపు పలికే యోచనలో రైల్వే బోర్డు ఉన్నట్లు తెలుస్తోంది. ఇటువంటి నియామకాలపై సమీక్ష నిర్వహిస్తున్నామని ఆదేశాల్లో తెలిపింది బోర్డు.