బంగాల్, ఝార్గ్రామ్ లో ఓ యువతి కడుపులో నుంచి 1.5 కిలోల వెంట్రుకలు బయటకు తీశారు. తీవ్ర అస్వస్థతతో స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చేరిన 17 ఏళ్ల ఓ యువతి జీర్ణాశయంలో వెంట్రుకలున్నట్లు గుర్తించి, వెంటనే శస్త్ర చికిత్స చేశారు.కొద్దిరోజులగా మానసిక రుగ్మతతో బాధపడుతున్న ఆమె.. గట్టిగట్టిగా ఏడుస్తూ, తన వెంట్రుకలు తానే తినేసిందని... రోజుకు కొన్ని వెంట్రుకలు చేరి కడుపులో పేరుకుపోయాయని వైద్యులు చెప్పారు.