కేరళ రాష్ట్రాన్ని వరదలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. విపరీతమైన వర్షాలతో కేరళ ను వరదలు ముంచెత్తుతున్నాయి. వరదల కారణంగా కొండచరియలు విరిగిపడి ఏకంగా 12 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 60 మంది ఈ శిథిలాల్లో చిక్కుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.