కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఎల్లయ్య.. నగరంలో ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.