ఆంధ్రప్రదేశ్లోని ప్రఖ్యాత అన్నవరం శ్రీసత్యనారాయణస్వామి ఆలయంలో 29 మందికి కరోనా వైరస్ సోకింది. ఉద్యోగులు, అర్చకులు కలిపి 29 మందికి వైరస్ వచ్చినట్టు అధికారులు నిర్ధారించారు. ఈ క్రమంలో అన్నవరంలో ఈ నెల 14 వరకు దర్శనాలు నిలిపివేస్తున్నట్టు ఈవో త్రినాథరావు తెలిపారు. స్వామివారికి నిత్య ఆర్జిత సేవలు యథాతథంగా జరుగుతాయని ప్రకటించారు.