కర్ణాటక యాదగిరి జిల్లా హుణసగి తాలుకాలోని గిరిజన ప్రాంతానికి చెందిన టొప్పన్న అనే వ్యక్తి 5 రోజుల కిందట గొర్రెల మందను మేపడం కోసం కృష్ణా నదిలోని ఓ ద్వీపానికి వెళ్లాడు. అయితే తిరిగి ఇంటికెళ్దామనుకునే లోపు.. కృష్ణా నది ప్రవాహం పెరిగింది. ఇక చేసేదేమీ లేక తన గొర్రెల మందతో సహా అక్కడే ఉండిపోయాడు.విషయం తెలసుకున్న స్థానిక తహసీల్దార్ సహాయక చర్యలు చేపట్టారు. కృష్ణానది పరివాహక ప్రాంతానికి చేరుకున్నారు