కాన్పూర్ కొలెనెగంజ్కు చెందిన అహ్మద్ హాసన్.. భార్యతో చిన్న గొడవ జరిగి ఆగస్టు 2న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆగస్టు 5న ఓ మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. హాసన్ సోదరులు ఆ మృతదేహాన్ని చూసి తమ తమ్ముడే అని బోరున విలపించారు. కుటుంబ సభ్యులంతా పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు. హాసన్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. కానీ, ఖననం చేసిన రెండో రోజు హాసన్ ఇంటికొచ్చాడు.